NTV Telugu Site icon

CM Chandrababu: ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం.. సీఎం కీలక వ్యాఖ్యలు

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో నది జలాల పంపిణీకి ఒప్పందం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయని.. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. అయితే, మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఇవ్వడానికి ఆ ఆర్డినెన్స్ తీసుకువచ్చాం అన్నారు.. ఎన్టీఆర్ నీళ్ల విషయంలో ముందుచూపుతో ఉంటారు.. మళ్లీ నేను వీటిని కొనసాగిస్తూన్నాను అన్నారు.. తోటపల్లి.. వెలిగొండ అన్ని ప్రాజెక్ట్‌లు నేనే ప్రారంభించాను.. ఉత్తరాంధ్రలో నీళ్లు అందుబాటులో లేవు.. కానీ, వర్షాలు ఎక్కువ.. రాయలసీమలో కరువు ఉంటుంది.. వ్యవసాయంపై ప్రభావం పడుతోందన్నారు.

Read Also: Pakistan-Afghanistan: పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్‌ పరస్పర దాడులు.. యుద్ధం తప్పదా?

అనంతపురంలో హార్టీకల్చర్ బాగా పెరిగింది.. వరదలు వచ్చినప్పుడు గోదావరిలోకి వృథాగా నీళ్లు పోతున్నాయి అన్నారు సీఎం చంద్రబాబు.. మనకున్న రిజర్వాయిర్‌లో 983 టీఎంసీ కెపాసిటీ ఉంది.. వర్షాలు బాగా పడ్డాయి. సకాలంలో రిజర్వాయర్‌కు మళ్లించగలిగాం.. నదుల అనుసంధానం జరిగితే భవిష్యత్‌లో నీటి సమస్య ఉండదు అన్నారు.. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్‌ నుంచి బనకచర్ల దగ్గర కలపడం అనేది మా ప్రయత్నంగా తెలిపారు.. వెలిగొండ ఆయకట్టుకు కూడా నీరు ఇచ్చేలా.. ప్రాజెక్ట్ చేయాల్సి ఉందన్నారు.. ఈ బనకచర్ల ప్రాజెక్ట్.. వల్ల రాష్ట్రం మొత్తం అనుసంధానం అవుతుందన్నారు. తెలుగుతల్లికి జలహారతి పేరుతో ఈ బనకచర్ల ప్రాజెక్ట్‌ ఉండబోతోందన్నారు. ఇక, గోదావరి నది నుంచి కృష్ణా నదికి.. తర్వాత నాగార్జున సాగర్ మీదుగా బనకచర్ల ప్రాజెక్ట్ నీళ్లు చేరతాయని.. బనకచర్ల రాయలసీమకు గేట్ వే అవుతుందని.. రాయలసీమలో ప్రతి ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి ఉంటుంది. 80 వేల కోట్లతో మొత్తం ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించారు సీఎం..

Read Also: UP: స్నేహితుడి ప్రియురాలి వీడియోలు దొంగిలించి బ్లాక్ మెయిల్.. బయటకు తీసుకెళ్లి ఏం చేశాడంటే..!

ఇక, బనకచర్ల మొత్తం ప్రాజెక్ట్‌కు 80 వేల 112 కోట్లు అవుతుంది. అటవీ అనుమతులు తీసుకోవాలి.. సాగు, తాగు నీరు.. పరిశ్రమల అవసరాల కోసం ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు సీఎం చంద్రబాబు.. పులిచింతల.. బొల్లాపల్లి.. నాగార్జునసాగర్.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లతో కలిపి రాయలసీమలో పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వాయర్‌లు.. బేలెన్సింగ్‌గా ఉంటాయని.. నీటి అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.. ప్రజల్లో కూడా చర్చ జరగాలి.. ఇదో గేమ్‌చేంజర్‌.. అందుకే జలహారతి అని పేరు పెట్టాం అన్నారు.. నిధులు అందుబాటులో ఉంటే ప్రాజెక్ట్ త్వరగా అవుతుందన్నారు.. కేంద్ర ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడా.. ప్రధాని కూడా బాగా ఆసక్తిగా ఉన్నారు.. నదుల అనుసంధానంపై ప్రధాని దృష్టి పెట్టాలి.. హైబ్రిడ్ మోడల్ కూడా ఆలోచిస్తున్నాం.. నిధులు ఉంటే మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Show comments