CM Chandrababu: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.. బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్‌టీ ప్రసాద్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు విద్యార్థినులు.. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు.. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Also: RAPO 22 : హైదరాబాద్ లో ఆంధ్ర కింగ్..
కాకినాడ జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు సీఎం చంద్రబాబు నాయుడు.. దీంతో, సీఎంకు నివేదిక అందించారు వైద్యఆరోగ్య శాఖ అధికారులు. దీనిపై స్పందించిన సీఎం.. నిందితులపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈనెల 9వ తేదీన విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు.. ఘటనను సీరియస్ గా తీసుకుని.. దీనిపై అదే రోజు కమిటీ నియమించి విచారణ చేపట్టారు అధికారులు.. నిన్న రాత్రి వరకు విద్యార్థినులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేసింది విచారణ కమిటీ.. చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది.. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. నిందితులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నారు అధికారులు..
