Site icon NTV Telugu

AP Secretariat: సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఘటనా స్థలానికి సీఎం.. చెత్తపై సీరియస్‌..

Secretariat Fire Accident

Secretariat Fire Accident

AP Secretariat: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది.. లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా? లేదా? అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం, 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Raghuveera Reddy: మూడు ‘సీ’లు కలిస్తే దేశం సుభిక్షం..

Exit mobile version