CM Chandrababu: కేబినెట్ ప్రారంభానికి ముందే మంత్రులతో విడివిడిగా సీఎం భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరితో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీల్లో ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) సమర్పించిన నివేదికపై కేబినెట్లో విస్తృతంగా చర్చించాలనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
Read Also: Stock Market: ట్రేడ్ డీల్‌తో పండిన ఇన్వెస్టర్లకు పంట.. రూ.20 లక్షల కోట్ల సంపాదన
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఇక, ఆ తర్వాత ప్రారంభమైన కేబినెట్ ఎజెండాలో తిరుమల లడ్డూ అంశంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది… సిట్ నివేదికను అధికారికంగా ప్రెజెంట్ చేసిన అనంతరం, ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మంత్రులు, పార్టీ నేతలకు గట్టి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. లడ్డూ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ నేతలకు పవన్ క్లాస్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ అంశంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..