CM Chandrababu: టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో దీనిపై హాట్ కామెంట్లు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు.. మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు ముఖ్యమంత్రి.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించినవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందన్నారు.. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి చర్యలు తీసుకుంటాం. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు.. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో.. అటు కూటమి నేతలు.. ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది.. తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదంటున్న వైసీపీ నేతలు.. దానికి చివరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే..