CM Chandrababu: ప్రతిపక్షం లేదని లైట్‌ తీసుకోవద్దు.. మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సమావేశాలకు హాజరైనా.. రేపటి నుంచి వైఎస్‌ జగన్‌ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు అవుతారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు.. అయితే, కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు.. ఈ సందర్భంగా మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అసెంబ్లీకి ప్రతి మంత్రీ సబ్జెక్ట్ ప్రకారం ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రతిపక్షం లేకపోయినా “ఏదో ఒకటి సభలో చెప్పుదాం” అనే తార్కిక ధోరణి వద్దు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు మంత్రుల పేషీలో ఉండి MLAల సమస్యలను పరిష్కరించాలని అని స్పష్టం చేశారు..

Read Also: Hardeep Singh Puri: ‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..

సభలో మంత్రులు చెప్పే సమాధానాలు సంక్షిప్తం, అర్థమయ్యే రీతిలో ఉండాలని అని సూచించారు సీఎం చంద్రబాబు.. ఇక, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేర్లను స్వర్ణ సచివాలయాలుగా మార్చడం. అసైన్ చేసిన భూములను సౌరశక్తి కింద కౌలు ఇవ్వడానికి అనుమతి.. ఒక్కో ఎకరాకు ఏడాదికి 30,000 రూపాయలు, రెండు సంవత్సరాల తరువాత 5 శాతం పెంపు అంశాలపై సూచనలు చేశారు.. మరోవైపు.. శ్రీశైలంలో క్యూ లైన్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు అనౌన్స్‌మెంట్ చేయాలని సూచించారు.. ఇక, ఏపీకి రావాల్సిన 12,000 కోట్లు కేంద్రం విడుదలకు అంగీకరించింది.. మూడు ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.. కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..