CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBN Flight Technical Issue: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే ప్రత్యేక విమానానికి సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన సీఎం చంద్రబాబు.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు… అయితే, ఆయన ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యలు గుర్తించారు… దీంతో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. బేగంపేట విమానాశ్రయం నుంచి మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక విమానంలో ఏసీ సమస్య
ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని అధికారులు తనిఖీ చేయగా సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా విమానంలోని ఏసీ వ్యవస్థలో సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అదే విమానంలో ప్రయాణించడం సాధ్యం కాకపోవడంతో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు హైదరాబాద్‌లో మరో ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి బయలుదేరారు. అక్కడికి చేరుకున్న వెంటనే సిద్ధంగా ఉంచిన మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read
- Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
- AP Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి పెట్టుబడుల జాతర.. పలు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్
- YS Jagan: పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు..! జగన్ సంచలన ఆరోపణలు.. రీపోలింగ్‌కు డిమాండ్..
- AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన
ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణ ప్రణాళికలో మార్పు వచ్చినప్పటికీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. కాగా, డీలిమిటేషన్, మహిళా బిల్లులపై కీలక చర్చల నేపథ్యంలో.. కేంద్రం నుంచి పిలుపుతో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు బయల్దేరుతున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
-
RC17 : రామ్ చరణ్ సినిమాలో నటించేలానుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్
-
Lok Sabha Seats Increase: లోక్‌సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
-
KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
-
Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!