Site icon NTV Telugu

Amaravati: అమరావతికి అదనంగా మరో రూ.14,200 కోట్లు..

Amaravati

Amaravati

Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పనులు చకచకా సాగుతుండగా.. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు.. ఇక, మరో 11 వేల కోట్ల రూపాయల రుణం ఇస్తోంది హడ్కో.. అదనపు రుణం మంజూరైతే మొత్తం 40 వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి..

Read Also: గేమింగ్ లవర్స్ గెట్ రెడీ.. RGB లైట్స్‌తో మెరిసే ఫీచర్స్తో వచ్చేస్తున్న iQOO 15!

కాగా, మొత్తం 88 వేల కోట్ల రూపాయలతో అమరావతిలో వివిధ పనులకు ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికి 50 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్.. అమరావతిలో పలు ఇతర ప్రాజెక్టుల కోసం ఎస్.పి.వి. ఏర్పాటు చేయుంది రాష్ట్ర ప్రభుత్వం.. అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంక్ – ఏడీబీకి దరఖాస్తు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా, అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అదనంగా మరో 1.6 బిలియన్ డాలర్ల రుణం అంటే రూ.14,200 కోట్లు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది..

Exit mobile version