NTV Telugu Site icon

AP News: ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట..

Ap High Court

Ap High Court

ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: Gannavaram: చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని యాగం చేపట్టిన యార్లగడ్డ..

ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. అయితే సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. కమిషనర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నోటీసులు, ప్రొసీడింగ్స్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. ఐసీయూలో ఉన్న మహిళకు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం..

Show comments