ఈ మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా విమానయాన సంస్థలు, హోటళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే.. ఇప్పటికే ఏపీలోని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా బాంబు కాల్స్ మొదలయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.
Read Also: AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు పోస్టింగులు.. ఆమ్రపాలి పోస్ట్ ఇదే
వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తుండటంతో నగరవాసులు, పోలీసులు హడలిపోతున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయానికి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో.. ఆలయంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఉదయం మూడు హోటల్స్‌కు ఇదే తరహాలో మెయిల్ వచ్చింది. హోటల్స్‌లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. హోటల్స్‌లోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం బాంబు లభించలేదని అధికారులు నిర్ధారించారు.
Vijay: విజయ్ ఎవడికి భయపడడు.. తొలి బహిరంగ సభలోనే పవర్‌ఫుల్ స్పీచ్