YS Jagan: హలో ఇండియా.. ఆంధ్రాలో అరటి రైతుల దుస్థితి చూడండి..!
- హలో ఇండియా.. ఆంధ్రాలో అరటి రైతుల దుస్థితి చూడండి..
- ఏపీలో ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకే అమ్ముడవుతున్నాయి..
- ఈ పరిస్థితి రాష్ట్రం లోని అరటి రైతుల ఆవేదనను బయట పెడుతుంది..
- లక్షలు ఖర్చు పెట్టి, నెలల తరబడి శ్రమించిన రైతులకు నిజంగా పెద్ద దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతుల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో అరటి రైతుల పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు. “హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం ఏ స్థితిలో ఉందో చూడండి” అంటూ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకే అమ్మబడుతున్నాయి. మాచీస్ బాక్స్, బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువ ధరకు అరటి రైతులు తమ పంట అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు పెట్టి, నెలల తరబడి శ్రమించిన రైతులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దిగ్భ్రాంతికరం అని అన్నారు.
Read Also: Shamirpet Police Station : శభాష్.. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్.. తెలంగాణలో మొదటి స్థానం
Also Read
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
అరటితో పాటు ఉల్లి, టమాటా వంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. అలాగే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం అందించడంలేదని ఆరోపించారు. ఉచిత పంట బీమా లేదు.. విపత్తుల సమయంలో ఇన్పుట్ సబ్సిడీలు లేవు.. పంట సహాయం మాటలకే పరిమితం అంటూ విమర్శలు గుప్పించారు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నుకు అరటి ధరను సగటున రూ.25,000 వరకు నిలబెట్టామని, అవసరమైతే రైతుల పంటను ఢిల్లీ వరకూ పంపేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని.. అలాగే కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి రైతులను రక్షించాం అని గుర్తుచేశారు. యువత, రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని విమర్శిస్తూ.. “ఒక కిలో అరటి ధర 50 పైసలు అయితే.. ఆ రైతు చేతుల విలువ ఎంత?” అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్..
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్‌పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!