NTV Telugu Site icon

Balineni to Meet Pawan Kalyan: జనసేన గూటికి బాలినేని..! రేపు పవన్‌ కల్యాణ్‌తో భేటీ

Balineni Pawan

Balineni Pawan

Balineni to Meet Pawan Kalyan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట బాలినేని.. రేపు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారట బాలినేని.. నిన్న జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది.. గత కొద్దిరోజులుగా వైఎస్ జగన్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని.. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్న అభిప్రాయంతో ఉన్నారట.. అందులో భాగంగానే ఇప్పటికే తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పంపిన బాలినేని.. అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరతారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..

Read Also: Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు

వైఎస్‌ కుటుంబంతో మంచి అనుబంధం.. బంధుత్వం ఉన్న నేత బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.. ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని.. సీనియర్‌ రాజకీయ నేతగా ఉన్నారు.. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అయితే, 2019లో మళ్లీ గెలిచి వైసీపీ ప్రభుత్వం తొలి రెండున్నరేళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. ఇక, మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు బాలినేని.. మరోవైపు, గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌ టికెట్‌ విషయంలోనూ వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి వార్తల్లో ఎక్కారు.. ఎన్నికలకు ముందు నుంచే బాలినేని.. అసంతృప్తితో ఉన్నారనే చర్చ సాగినా.. ఇప్పుడు కూడా తన ప్రాధాన్యత దక్కడంలేదంటూ ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు.

Read Also: Kumari Aunty : ముఖ్యమంత్రి సహాయనిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే..!

ఇక, రాజీనామా లేఖలో సంచల విషయాలు రాసుకొచ్చారు బాలినే.. కొన్ని కారణాల రీత్యా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనా చేస్తున్నాను.. రాష్ట్ర ప్రగతి పథంలో వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను.. కారణం అంతిమంగా ప్రజాశ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా? అని ప్రశ్నించారు.. విలువలను నమ్ముకొనే దాదాపు ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి. కొంత గర్వం కూడా ఉందన్న ఆయన.. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు.. వైఎస్‌ఆర్‌ కుటుంబానికి సన్నిహితుడిని అయినా.. ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకొన్నాను అని స్పష్టం చేశారు.. ఎలాంటి మోహమాటాలకు నేనే పోలేదు.. అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే.. నేను ప్రజా నాయకుడిని. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం.. రాజకీయాల్లో భాష గౌరంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం నేను చేశాను అంటూ తన రాజీనామా లేఖలో పేర్కొనడంతో.. వైసీపీలో జరుగుతోన్న పరిణామాలను ఆయన తప్పుబట్టారు.

Show comments