వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట బాలినేని.. రేపు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారట బాలినేని..
వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.. బంధువు అయిన.. కీలక నేత.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం పార్టీని వీడారు.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు..