Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Are Shyamala: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యవహారంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని కూటమి ప్రభుత్వం మత్తులో ముంచుతోందని ఆరోపించారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని గంజాయిరహితంగా మార్చేశామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, అదే సమయంలో వేల సంఖ్యలో మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేసి గంజాయి పట్టుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని శ్యామల ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్నదేంటి.. పోలీసుల లెక్కలు చెబుతున్నదేంటని నిలదీశారు. అద్దంకిలో గంజాయి తరలిస్తూ పోలీసులు పట్టుబడ్డారని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న డ్రగ్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా ఆరె శ్యామల విమర్శలు చేశారు. తన శాఖపై దృష్టి పెట్టడం కంటే టీవీ షోలకు టీఆర్పీలు పెంచుకోవడంపైనే ఆమెకు ఎక్కువ శ్రద్ధ ఉందని ఆరోపించారు. మాటలకే పరిమితమైన హోంమంత్రిగా అనిత మిగిలిపోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఒక్క గంజాయి మొక్క కూడా కనిపించకుండా చేస్తామని గతంలో గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. ఇక, డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీనే పట్టుబడ్డారని శ్యామల ఆరోపించారు. యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) ఏర్పాటు చేసి గంజాయిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడం తప్ప గత రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతను మాదక ద్రవ్యాల బారినుంచి కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల.
Also Read
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!