NTV Telugu Site icon

APSRTC: సంక్రాంతి ‘పండుగ’ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ.. రికార్డు స్థాయిలో ఆదాయం..

Apsrtc

Apsrtc

APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ).. అసలైన సంక్రాంతి పండుగ చేసుకుంది.. రాష్ట్రంలోని పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటిన విషయం విదితమే.. ఈ సమయంలో.. ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్లిన వాళ్లు.. సొంత ఊళ్లకు తరలివచ్చారు.. కొందరు సొంత వాహనాల్లో వెళ్తే.. మరికొందరు పబ్లిక్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ను ఆశ్రయించారు.. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల రూపాయలను సంక్రాంతి పండుగ సమయంలో ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ..

Read Also: Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే

సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణికులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనంగా పేర్కొంది ఏపీఎస్ఆర్టీసీ.. పండు సమయంలో ప్రయాణికులు వారి ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారని.. ఇతర, ప్రైవేట్‌ వాహనాలు మరియు సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారని పేర్కొంది.. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహనకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు బస్సులను పర్యవేక్షించడం, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని.. దీనివల్లే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించిందని పేర్కొంది.. సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారియొక్క కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని ప్రకటించారు..