AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక అప్‌డేట్..

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు..
  • ఇప్పటికే బెంగళూరు వెళ్లివచ్చిన కేబినెట్ సబ్ కమిటీ..
  • తెలంగాణ, కర్ణాటక వెళ్లి వచ్చిన అధికారులు..
  • ఏపీ ప్రభుత్వానికి చేరిన నివేదికలు..
  • ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కసరత్తు..
Apsrtc

Apsrtc

AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్నింటిని నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. ఇక, ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు కొనసాగిస్తోంది.. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు వెళ్ళి వచ్చింది.. అక్కడ ఆ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసింది.. ముఖ్యమంత్రి, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలపై కూడా దృష్టిపెట్టారు.. అలాగే అధికారులు సైతం తెలంగాణ, కర్ణాటక వెళ్ళి వచ్చారు… ఇద్దరి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు.. ప్రధానంగా కొత్త బస్సులు కొనాలని, కొత్తగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం జరపాలని నివేదికలో తెలిపినట్టు సమాచారం.. దీంతో ఉగాది నాటికి కసరత్తు పూర్తి చేసి, ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం సిద్ధమవతోందని తెలుస్తోంది…

Read Also: Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో