AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు..
- మరోవైపు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
- రాష్ట్ర ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగుల ప్రమాదం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. APSDMA అంచనాల ప్రకారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా హోర్డింగ్స్ కింద నిలబడరాదని APSDMA హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. అలాగే వర్షపు గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.
Also Read
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
మరోవైపు ఎండల తీవ్రత కొనసాగింపు
వర్షాల సూచనలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని APSDMA వెల్లడించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో నేడు అత్యధికంగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో 42.2 డిగ్రీలు నమోదయ్యాయి. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మరియు విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. వర్షాలు, పిడుగులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!