Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత నిధుల జమ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఈ విడత ద్వారా 64,76,590 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.
2026–27 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.10,120.78 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులు, 42.70 లక్షల మంది తల్లులు, సంరక్షకులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయం మంజూరు చేయగా, అందులో రూ.2 వేలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం మినహాయించి రూ.13 వేలను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత వివరాలు, లబ్ధిదారుల సమాచారం మన మిత్ర వాట్సాప్ సేవతో పాటు లీప్ (LEAP) యాప్ ద్వారా కూడా సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
మరోవైపు, అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విదితమే.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల అంగన్వాడీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అంగన్వాడీలతో పాటు శానిటేషన్ వర్కర్ల పిల్లలను కూడా ఈ పథకం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ నిధులను ఇవాళ విడుదల చేస్తోంది ప్రభుత్వం.. ఇందుకోసం ఇప్పటికే రూ.10,120.78 కోట్లను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15,000 చొప్పున ఈ ఆర్థికసాయం జమ కానుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు, రూ.2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతున్నాయి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..