Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దీంతో, తొలిసారిగా రూ. 3 లక్షలు కోట్లు దాటింది రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటేసింది.. ఇక, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత.. సభలోని సభ్యులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
Read Also: SLBC Tunnel Collapse: భయంగా ఉంది.. సొంతూర్లకి ఎస్‌ఎల్‌బీసీ కార్మికులు!
నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు.. దాంతో పాటు.. ఇప్పటికే ఎన్నో బడ్జెట్‌లను సూచిన సభ్యులు కూడా ఉన్నారని తెలిపిన ఆయన.. బడ్జెట్ ను అందరూ చదవాలి.. బడ్జెట్ పత్రాలను అన్ని పెన్ డ్రైవ్ లో ఇస్తాం. సభ్యులు వాట్సాఅప్ గ్రూప్ లో పెట్టుకోవాలి. నియోజకవర్గ పరిధిలో సరళ మైన భాషతో బడ్జెట్‌పై చెప్పాలని సూచించారు.. బడ్జెట్ ను అందరూ స్టడీ చేయాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రతి ఒక్కరికి బడ్జెట్ పై అవగాహన ఉండాలన్నారు.. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో బడ్జెట్ ను సరళమైన భాష లో జనంలోకి తీసుకు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు.. రాష్ట్ర అభివృద్ధిలో సహకారం అందించాలన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
Read Also: IITA Passing Out Parade: ఐఐటీఏలో డాగ్ స్క్వాడ్ పాసింగ్ అవుట్ పరేడ్.. డీజీకి పూలబొకే ఇచ్చిన జాగిలం!
కాగా, తన బడ్జెట్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంతరి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లను ప్రస్తావించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆయా సందర్భాల్లో వారు మాట్లాడిన కామెంట్లను.. తీసుకుంటున్న చర్యలను తన ప్రసంగంలో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి పయ్యావుల.. మరోవైపు.. అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్న సందర్భంగా.. స్వయంగా వీక్షించడానికి వచ్చారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు కేశినేని చిన్ని , రాజ్యసభ సభ్యులు సానా సతీష్.. అసెంబ్లీలో పయ్యావుల కేశవ బడ్జెట్ ను విజిటర్స్ గ్యాలరీలో ఉండి వీక్షించారు.. రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు..