AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో 2026 గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది.. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది.. ఇక, ఈ వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించే దిశగా సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక నిధులను భారీగా పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం G.O.Rt.No.1111 ఉత్తర్వులను జారీ చేసింది. జనాభా ఆధారంగా ఏకగ్రీవ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక మొత్తాలను సవరించింది.
జనాభా ఆధారంగా ప్రోత్సాహక నిధులు
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల ప్రోత్సాహక నిధులు అందించనున్నారు. ఇందులో 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలతో పాటు 2,001 నుంచి 5,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలను ఒకే కేటగిరీగా పరిగణించారు. 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు కేటాయించనున్నారు. ఇక, 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏకంగా రూ.50 లక్షల ప్రోత్సాహక నిధులు అందించనున్నారు.
Also Read
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
- Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
- CII Partnership Summit: ఏపీ పారిశ్రామిక రంగానికి బూస్ట్.. 73 కంపెనీలతో కీలక ఒప్పందాలు.. లక్ష మందికి పైగా ఉద్యోగాలు
- AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
మరోవైపు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తొలి విడతలో గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, పంచాయతీల్లో ఎన్నికల ఖర్చులు, రాజకీయ పోటీ, ఇతర వివాదాలను తగ్గించి గ్రామాల్లో ఐక్యతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనప్పుడే ఈ ప్రోత్సాహక నిధులు వర్తించనున్నాయి. ప్రభుత్వం పెంచిన నిధులతో గ్రామ పంచాయతీలకు అదనపు ఆర్థిక వనరులు సమకూరనున్నాయి. ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించుకునే అవకాశం ఉండటంతో ఏకగ్రీవ ఎన్నికలపై గ్రామాల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
-
Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
-
IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
-
CP Mahesh Bhagwat: “అదే నా మొదటి ప్రాధాన్యత”.. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..