Minister Vasamsetti Subhash: వైఎస్ జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదు.. కనీసం, యోగాతోనైనా ఆరోగ్యం సక్కబడుతుంది.. యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగ్‌లుగా చెబుతున్న జగన్.. రౌడీయిజం, హింస ప్రేరేపించేలా నీ పరామర్శ యాత్రలు ఏంటి? అని ప్రశ్నించారు.. కొట్టండి, చంపండి, వార్ డిక్లేర్ అంటూ చేసే హింసా నినాదాల్ని సమాజం క్షమించదు అని హెచ్చరించారు.. సినిమాల్లో మనుషుల్ని చంపారని నిజ జీవితంలోనూ చంపేస్తారా..? జగన్ కు ఇదేం మానసికస్థితి, రోగం అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. పుష్ప సినిమాల్లో మనుషుల్ని చంపారని.. నిజ జీవితంలోనూ చంపేస్తారా…? జగన్ కు ఇలాంటి మానసిక స్థితి ఏమిటని ఆగ్రహo వ్యక్తం చేశారు.
Read Also: Kannappa : కన్నప్ప మేకింగ్ వీడియో.. ప్రభాస్ ఎలా చేస్తున్నాడో చూడండి..
ఇక, రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది యోగా పట్ల అవగాహన పెంపొందించుకున్నారు.. వైఎస్ జగన్ అండ్ టీం కూడా యోగా చేస్తే మానసిక స్థితి కుదుటపడుతుందని సూచించారు వాసంశెట్టి సుభాష్. యోగాంధ్ర నిర్వహణపై ప్రపంచమంతా ఆంధ్ర వైపు చూస్తోంది. పీఎం మోడీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో యోగాంధ్ర ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కిందన్నారు.. వైఎస్ జగన్ హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపారు. కొట్టండి, చంపండి అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారు. దేశంలోని ఏ రాజకీయనాయకుడికి, రాజకీయ పార్టీకి ఈ తరహా పోకడలు లేవు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరం.. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్ లు, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారని మండిపడ్డారు.
Read Also: Bolisetti Srinivas: రప్పా.. రప్పా.. నరకడానికి ఆయన ఏమైనా స్టేట్ రౌడీనా..?
ప్రజలు భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడి గురించి ఆలోచించాలన్నారు మంత్రి సుభాష్.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. తాను ఇంకా సీఎం అనే భ్రమలోనే ఉన్నారు జగన్.. రౌడీయిజం చేయాలని అందరికీ మార్గ దర్శనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు రోడ్డుపైకి వస్తే భయంకర పరిస్థితులు వస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హింస రాజకీయాన్ని వ్యతిరేకించాలి .. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.. భవిష్యత్ ను తీర్చిదిద్దే నాయకుడి గురించి ప్రజలు నిత్యం ఆలోచించాలన్నారు. ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి, బుద్ధిగా ఉండు.. మీకు ప్రజలు ఎప్పుడో సినిమా చూపించారు.. శుభం కార్డు వేశారు అంటూ వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్.
