Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Liquor Scam Investigation Fsl Phone Forensics Report Reaches Court Sit To Access It Tomorrow

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కోర్టుకు చేరిన FSL రిపోర్ట్..

Published Date :January 6, 2026 , 7:01 pm
By Sudhakar Ravula
  • లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం..
  • కోర్టుకు చేరిన నిందితుల ఫోన్స్ FSL రిపోర్ట్..
  • కోర్టు నుండి FSL రిపోర్టును తీసుకోనున్న సిట్..
  • లిక్కర్ స్కాం అనంతరం ఫోన్లను ధ్వంసం చేసిన నిందితులు..
  • FSL రిపోర్ట్ అందితే కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం..
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కోర్టుకు చేరిన FSL రిపోర్ట్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ (FSL) నివేదిక కోర్టుకు చేరింది.. ఫోన్లలోని డేటా, కాల్ రికార్డులు, డిలీట్ చేసిన ఫైల్స్, ఇతర డిజిటల్ ఆధారాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తి చేసి నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు.. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోర్టు నుంచి ఈ FSL రిపోర్టును రేపు అధికారికంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోర్టు అనుమతితో SIT బృందం నివేదిక కాపీని స్వీకరించి, అందులోని కీలక అంశాల ఆధారంగా తదుపరి విచారణను వేగవంతం చేయనుంది.

Read Also: Cyberabad Police : మీ పిల్లలకి కావాల్సింది ర్యాంకులు కాదు.. మీ తోడు.!

Also Read

  • CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
  • Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..
  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
Add as a preferred
source on google

అయితే, లిక్కర్ స్కాం బయటపడిన వెంటనే నిందితులు తమ మొబైల్ ఫోన్లను ధ్వంసం (destroy) చేసినట్లు ఇప్పటికే సిట్‌ గుర్తించింది. అయితే, FSL నిపుణులు అధునాతన టెక్నాలజీతో ఫోన్లలోని చిప్స్‌, స్టోరేజ్ భాగాల నుంచి డేటాను రికవరీ చేసి విశ్లేషణ చేసినట్లు సమాచారం. దీంతో, స్కామ్‌లో జరిగిన కమ్యూనికేషన్‌, లావాదేవీల డిజిటల్ ఆధారాలు బయటపడే అవకాశం మరింత పెరిగింది. FSL రిపోర్ట్‌ SIT చేతికి అందితే.. స్కాం వెనక ఉన్న నెట్‌వర్క్‌, నిందితుల మధ్య జరిగిన చాట్స్‌, కాల్స్‌, డిలీట్ చేసిన డాక్యుమెంట్లు, డిజిటల్ లావాదేవీల వివరాలు, కీలక వ్యక్తుల పాత్ర వంటి అంశాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోర్టు నుంచి FSL రిపోర్టును రేపు SIT బృందం తీసుకోనుండటంతో, దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది. నివేదికలోని వివరాల ఆధారంగా సిట్‌ కొత్త నోటీసులు, విచారణలు, అవసరమైతే అదనపు అరెస్టులపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Liquor Scam
  • AP forensics report court
  • AP Liquor Scam Case
  • CRDA not relevant
  • destroyed phones data recovery

తాజావార్తలు

  • Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!

  • Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!

  • TheyCallHimOG2 : OG -2.. నిర్మాణ భాద్యతలు ఆ రెండు సంస్థలకు?

  • చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions