AP High Court: ధర్మాన ప్రసాదరావుకు ఏపీ హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల సందర్భంగా ధర్మాన ప్రసాదరావును ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించకుండా పోలీసులు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది.
శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 26న ఉదయం 6.30 గంటలకు పోలీసులు ఎలాంటి కారణం చూపకుండా తనను గృహ నిర్బంధంలో ఉంచారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దీంతో ఎన్నికల ఏజెంట్‌గా తన బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుకున్నారని పేర్కొంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్నికల ఏజెంట్ అనేది ఎన్నికల ప్రక్రియలో భాగమని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఏజెంట్లను అనుమతించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావును ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించకుండా అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది. శ్రీకాకుళం మేయర్ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
- CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
- Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
తాజావార్తలు
-
Summer Holidays : ఒకేసారి 5 భాషల్లో ఓటీటీలోకి ‘సమ్మర్ హాలీడేస్’! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
Meenakshi : విసిగిపోయి ఆ ఆఫర్లన్నీ రిజెక్ట్ చేశా
-
MS Narayana: ఘనంగా ఎంఎస్ నారాయణ మనవరాలు వివాహం.. టాలీవుడ్ ప్రముఖుల సందడి..!
-
O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?
ట్రెండింగ్
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!