Site icon NTV Telugu

Ambati Rambabu 35 Quash Petitions: అంబటి 35 క్వాష్‌ పిటిషన్లపై విచారణ.. ఒకే విషయంపై అన్ని FIRలు ఏంటి? హైకోర్టు ప్రశ్న

Ambati Rambabu 35 Quash Pet

Ambati Rambabu 35 Quash Pet

Ambati Rambabu 35 Quash Petitions: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై 35 క్వాష్ పిటిషన్ల విచారణను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయి. అయితే, అంబటి రాంబాబు వీటిని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు పోలీసులకు కీలక సూచనలు చేసింది. విచారణలో BNSS 35(3) ప్రొసీజర్‌ని పాటించాలని, తుది నిర్ణయం వెలువడే వరకు తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది.

Read Also: Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!

అయితే, ఒకే విషయంపై 35 FIRలు నమోదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది హైకోర్టు.. అంబటి రాంబాబు తరఫున హాజరైన లాయర్ కోర్టుకు చెప్పిన వివరాల్లో, ఒకే అంశంపై 35 FIRలు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. కానీ, ప్రభుత్వం తరపున వెలువడిన వాదనలో, వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఈ FIRలు అందుకున్నట్టు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది.. ఈ కేసులపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

Exit mobile version