Site icon NTV Telugu

AP High Court: కేజీబీవీల్లో శాశ్వత నియామకాలు.. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Ap High Court

Ap High Court

AP High Court: సమగ్ర శిక్ష పథకం కింద నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో (కేజీబీవీ) శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించే వ్యవహారంపై మార్గదర్శకాలు రూపొందించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. దేశ వ్యాప్తంగా పేద పిల్లల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని.. శాశ్వత సిబ్బందిని నియమించే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్చలు జరపాలని పేర్కొంది.. తదుపరి విచారణలో చర్చల పురోగతిని కోర్టుకు చెప్పాలని ఆదేశించింది హైకోర్టు.. ఇక, ఈ కేసులో తదువరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిన్ బట్టు దేవానంద్, జస్టిన్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్లను కేజీబీవీలలో కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) గుర్రం రామచంద్రరావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తాము దాఖలు చేసిన అప్పీళ్లను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. అప్పీళ్ల ఉపసంహరణకు ధర్మాననం నిరాకరించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు..

Read Also: Kavitha : లైబ్రరీ గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు

Exit mobile version