Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు

  • పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై విచారణ..
  • విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశాం..
  • హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం..
  • ఈ కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణ మురళి పిటిషన్‌ డిస్మిస్..
Posani Krishna Murali

Posani Krishna Murali

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశామని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. దీంతో, ఈ కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణ మురళి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది హైకోర్టు.. ఇక, విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతా రామరాజు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 34 BNS ప్రకారం నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.. మరోవైపు, విశాఖపట్నంలో నమోదైన కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణమురళి పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు..

Read Also: MOTOROLA Edge 50: అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ స్మార్ట్ ఫోన్ పై 11 వేల డిస్కౌంట్.. త్వరపడండి

కాగా, పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24వ తేదీన కేసు నమోదు కాగా.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్‌ మంజూరు చేసినా.. మిగతా కేసుల్లో బెయిల్‌ రాకపోవడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇక, పోసాని బెయిల్‌ పిటిషన్‌పై ఈ రోజు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది.. మరోవైపు, పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది కోర్టు.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను గతంలో దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని ట్రీ టౌన్ లో కేసు నమోదు అయిన విషయ విదితమే కాగా.. పోసానిని అరెస్ట్‌ చేసి విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి.. ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు.. ఇప్పటికే ఆయన పలు పీఎస్‌లు.. జైలులు చుట్టివచ్చిన విషయం విదితమే..