Ayesha Meera Murder Case: ఆయేషా మీరా హత్య కేసుపై సీబీఐ నివేదిక ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు జరిపింది. బాధితులుగా ఉన్న ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తల్లిదండ్రుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటి వరకు 18 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరిగారని మళ్ళీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్తితి వస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సీబీఐ కౌంటర్ దాఖలు చేయటంతో వచ్చే శుక్రవారానికి తదుపరి విచారణ ను కోర్టు వాయిదా వేసింది. ఆయేషా మీరా రీ పోస్ట్ మార్టం రిపోర్ట్, పార్టులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకురావటంతో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
Read Also: 3BHK: ప్రతి ఇంటి కథ.. ప్రతి ఒక్కరి కల .. కనీళ్ళు తెప్పించేలా 3BHK ట్రైలర్
ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషద్ బేగం మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్ళ క్రితం ఆయేషా మీరాను ఆనాడు దారుణంగా హత్య చేశారని అప్పటి పోలీసులు సరిగ్గా విచారణ చేయలేదన్నారు. సిబిఐ ఐదేళ్లల్లో విచారణ చేయాల్సి ఉండగా ఎనిమిది యేళ్లు చేశారన్నారు. కేసును కూడా రాష్ట్ర విభజన తర్వాత విశాఖ పంపారని సిబిఐ విచారణ పై కోర్టు లో పిటిషన్ కూడా వేశామన్నారు. ఈనెల 22వ తేదీన విచారణ పూర్తి చేశామని సిబిఐ కోర్టు మూడు నివేదిక లు ఇచ్చిందన్నారు. ఈ నివేదికలు కావాలంటే .. సిబిఐ కోర్టు లో పిటిషన్ వేసి నివేదిక తీసుకోవాలని అంటున్నారన్నారు. సిబిఐ విచారణ అసలు మేము కోరలేదు.. అప్పుడు ప్రభుత్వం వేసిందని రీ పోస్టుమార్టం చేసిన నివేదిక కూడా మాకు తెలియపరచలేదన్నారు.
Read Also: Priyanka Chopra : ప్రియాంకచోప్రాకు అంత సీన్ లేదు.. మాజీ ప్రపంచసుందరి కామెంట్స్
కోర్టు కు కూడా ఈ విషయం చెప్పకుండా దాచారని మాకు నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత సిబిఐ కి ఉందన్నారు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే సిఎం చంద్రబాబు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్నారు. ఆడపిల్లలు కు రక్షణ కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయన్నారు. మరి మాపాపకు జరిగిన అన్యాయం పై దోషులు ఎవరో తేలలేదన్నారు. ప్రభుత్వం స్పందించి మా పాపను చంపిన నిజమైన హంతకులు ను శిక్షించాలన్నారు. ఆయేషాతరపున న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయేషా మీరా హత్య ను విచారణ చేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ను ఇవ్వాలని హైకోర్టు లో అయేషా మీరా తల్లిదండ్రులు పిటీషన్ దాఖలు చేశారన్నారు. సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ లో నివేదిక ఇవ్వనక్కర్లేదని చెప్పారన్నారు. అంటే సిబిఐ దర్యాప్తు లో విఫలైందనే అనుమానం తమకు కలుగుతుందన్నారు. దీని పై విచారణ జులై నాలుగో తేదీకి హైకోర్టు వాయిదా వేసిందన్నారు. అసలు విచారణ నిష్పక్షపాతంగా చేశారా లేదా తెలియలన్నారు.
