AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తోందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాసింది. రానున్న కేఆర్ఎంబీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం బోర్డుకు పంపింది. శ్రీశైలం జలాశయం నుంచి 12 రోజుల్లో సుమారు 21 టీఎంసీల నీటిని వినియోగించినట్లు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ భాగం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిష్పత్తి గతంలో కేఆర్ఎంబీ పని విధానంలో కొనసాగిన వ్యవస్థకు అనుగుణంగా ఉందని బోర్డు వార్షిక నివేదికలోనూ నమోదైంది.
అలాగే కేఆర్ఎంబీ హెడ్‌క్వార్టర్స్‌ను అమరావతికి మార్చాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. వచ్చే నెల 1న జరగనున్న కేఆర్ఎంబీ సమావేశంలో ఈ అంశాలతో పాటు ఇతర జలవినియోగ అంశాలను చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ నీటిని విడుదల చేస్తున్న అంశంపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వినియోగం, పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
Also Read
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!