Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Pension Scheme: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టు మిత్రులకు ఉగాది సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే జర్నలిస్టుల కోసం పెన్షన్ స్కీమ్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.
Read Also: 7.55mm స్లిమ్ డిజైన్, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
వెటరన్ జర్నలిస్టులకు వారు కోరిన జిల్లాలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు మంత్రి పార్థసారథి.. జర్నలిస్టులకు త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన విధాన ప్రకటన చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, అవార్డుల పంపిణీతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, హెల్త్ కార్డుల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే పలు జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు రాష్ట్ర సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?