Cyclone Montha Damage: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టాన్ని మిగిల్చింది.. కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నా.. కోట్లలో నష్టం వాటిల్లింది.. అయితే, కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక అందచేసింది. మొత్తం రూ.5,244 కోట్ల మేర నష్టం వచ్చినట్టు నివేదికలో పేర్కొంది ప్రభుత్వం.. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజ్ఞప్తి చేశారు.. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని కోరారు… 249 మండలాల పరిధిలో 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడినట్లు ప్రాథమిక నివేదికలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Asia Cup 2025: రెండు రోజుల్లో భారత్‌కు ఆసియా కప్.. !
శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా మొంథా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపిన విషయం విదితమే.. ఈ తుఫాన్‌ను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, ముందు జాగ్రత్తతో నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని, ప్రభుత్వ చర్యలకు టెక్నాలజీ బాగా ఉపయోగపడిందని వెల్లడించారు.. తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన పంటలు- రూ.39 కోట్లు, పట్టు పరిశ్రమ- రూ.65 కోట్లు, ఆక్వా- రూ.1,270 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు- రూ.2,079 కోట్లు, పురపాలక శాఖ- రూ.109 కోట్లు, జలవనరుల విభాగం-రూ.207 కోట్లు, పంచాయతీరాజ్- రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ- రూ.16 కోట్లు ఇలా భారీ నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం విదితమే..
