Social Media Restrictions: సోషల్ మీడియాకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిందే.. ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Restrictions: సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపై తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో, నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఫేక్ న్యూస్, విద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో సోషల్ మీడియా నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. చిన్నారుల భద్రత, సమాజంలో శాంతి భద్రతలు, డిజిటల్ వేదికలపై బాధ్యతాయుత ప్రవర్తనకు మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరంపై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కొత్త వీడియోలో షాకింగ్ విజువల్స్..
Also Read
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
నిర్ణీత వయస్సు కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకూడదన్న అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రుల బృందం సూచించింది. అలాగే, ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్..
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మలేషియాలో ‘మై డిజిటల్ ఐడీ’ ద్వారా ఈ-కేవైసీ అనుసంధానం చేసి 16 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తున్నారని వివరించారు. ఈ తరహా విధానాలను మన రాష్ట్రంలో అమలు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టే వారితో పాటు, కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో సోషల్ మీడియా సంస్థల బాధ్యతను కూడా ఖరారు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గూగుల్, మెటా, ట్విట్టర్ (ఎక్స్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల కంప్లయన్స్ ఆఫీసర్లను వచ్చే మంత్రుల బృంద సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేందుకు ఐటీ యాక్ట్ సెక్షన్–46 ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్‌ను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సహయోగ్’ పోర్టల్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. ఇక, కంప్యూటర్ రిలేటెడ్ నేరాలు, సైబర్ లా ఉల్లంఘనలు కట్టడి చేయడం, సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సాంకేతిక నిపుణుల నియామకం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. డిజిటల్ వేదికలు సమాజానికి మేలు చేసేలా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!