NTV Telugu Site icon

AP Government: మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనపై సర్కార్‌ సీరియస్‌.. లైసెన్స్‌కే ఎసరు..!

Liquor

Liquor

AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ లిక్కర్‌ షాపులకు బైబై చెప్పేసింది.. కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకొచ్చి.. ప్రైవేట్‌ మద్యం షాపులను తీసుకొచ్చింది.. అయితే, కొన్ని చోట్ల లిక్కర్‌ షాపుల్లో తమకు తోచిన ధరలకు అంటే.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్‌ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నారు.. అయినా తీరు మారకుండారెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయనుంది ప్రభుత్వం..

Read Also: Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.

మరోవైపు ఇక, బెల్ట్‌ షాపుల విషయంలో కఠిన చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం.. బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయాలు సాగితే.. బెల్టు తీస్తానంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు హెచ్చరించిన విషయం విదితమే.. మొత్తంగా ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన విషయంలో సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది ప్రభుత్వం.. పైసలకు కకుర్తి పడి.. అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిస్తే.. తొలిసారి రూ.5 లక్షల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే.. ఇక, రెండోసారి చిక్కితే మాత్రం లైసెన్స్‌కే ఎసరు రానుంది..