NTV Telugu Site icon

AP Flood Relief Package: వరద సాయం ప్యాకేజీ.. నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్

Ap Flood

Ap Flood

AP Flood Relief Package: వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి.. ఇక, రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతినడంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు.. మరోవైపు.. విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది.. తక్షణ సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు సహా.. మంత్రులు.. అధికారులు.. ఉద్యోగులు.. నిర్విరామంగా కృషి చేశారు.. మరోవైపు.. వరద సాయం ప్యాకేజీకి అవసరమైన నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. వరద సాయంపై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది ఏపీ సర్కార్. వరద నష్టంపై అంచనా పనులు చేపడుతూనే.. జరిగిన నష్టాన్ని కేంద్ర పెద్దలకు వివరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం..

Read Also: IND vs BAN: చూసుకుందాం.. టీమిండియాకు బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ వార్నింగ్!

ఇక, వరద నష్టం అంచనా కోసం వారం రోజుల వ్యవధిలోనే రెండో సారి రాష్ట్రానికి వచ్చాయి కేంద్ర బృందాలు. వరద నష్టాన్ని.. ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్.. ఎన్యూమరేషన్ పూర్తి కాగానే.. కేంద్ర సాయం పైనా క్లారిటీ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటుంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, ఈ నెల 17వ తేదీన వరద సాయంపై ప్రకటన చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. నష్టపోయిన ప్రతి ఇంటికీ నగదు సాయం కింద ఓ ప్యాకేజీని ప్రకటించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాయం అందించాలని భావిస్తున్నారు ఏపీ సీఎం.. అందులో భాగంగానే ఇప్పుడు నిధుల సమీకరణపై దృష్టి సారించారు..