AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
- జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..
- ఏపీ ప్రభుత్వం కొత్త స్టాఫింగ్ విధానం..
- ప్రతి కలెక్టరేట్‌కు 85 పోస్టులే.. ఉత్తర్వులు..
- 28 కలెక్టరేట్లకు యూనిఫాం స్టాఫింగ్ ప్యాటర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో సిబ్బంది నియామక విధానాన్ని ఏకరీతిలో అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని 28 జిల్లా కలెక్టరేట్లలో ఒకే రకమైన కేడర్ స్ట్రెంగ్త్ అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం కలెక్టరేట్లతో పాటు అన్ని జిల్లాల్లో యూనిఫాం స్టాఫింగ్ ప్యాటర్న్ అమలు కానుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు గరిష్టంగా 85 పోస్టులు మాత్రమే కేటాయించనున్నారు. ఇందులో 53 రెగ్యులర్ పోస్టులు, 32 ఔట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయి. అన్ని కలెక్టరేట్లలో ఒకే విధమైన సిబ్బంది నిర్మాణం ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా కలెక్టరేట్లలో మిగులుగా ఉన్న 95 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటిలో 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 29 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 12 టైపిస్ట్ పోస్టులతో పాటు ఇతర విభాగాలకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే పాత కలెక్టరేట్లలో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA)కు ఆదేశాలు జారీ చేసింది. పరిపాలనలో సమర్థత పెంచడం, అన్ని జిల్లాల్లో సమానమైన సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
తాజావార్తలు
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?