NTV Telugu Site icon

Andhra Pradesh: వరద నష్టంపై ప్రాథమిక అంచనా.. కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్

Ap Flood

Ap Flood

Andhra Pradesh: విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయి.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు పూర్తిస్థాయిలో కోలుకోకపోగా.. మరోవైపు వర్షాలు మళ్లీ భయపెడుతున్నాయి.. అయితే, విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు సృష్టించిన నష్టంపై ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. కేంద్రానికి నివేదిక పంపింది.. వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..

Read Also: Budameru: బుడమేరులో కొట్టుకుపోయిన కారు

వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. అందులో రెవెన్యూ శాఖకు రూ.750 కోట్ల నష్టం.. పశు సంవర్ధక శాఖకు రూ.11.58 కోట్ల నష్టం.. మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం.. వ్యవసాయ శాఖకు రూ.301.34 కోట్ల నష్టం.. ఉద్యాన శాఖకు రూ.39.95 కోట్ల నష్టం.. విద్యుత్ శాఖకు రూ.481.28 కోట్లు.. ఆర్ అండ్ బీ శాఖకు రూ. 2164.5 కోట్లు.. గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.75.59 కోట్లు.. పంచాయతీ రాజ్‌ పరిధిలోని రోడ్లకు రూ.167.55 కోట్లు.. నీటి వనరులు రూ.1,568.55 కోట్ల నష్టం.. పురపాలన, అర్బన్‌లో రూ.1,160 కోట్ల నష్టం.. అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనావేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టాన్ని అంచనా వేస్తామని.. బాధితులు ఇంటి దగ్గరే ఉంటే.. పూర్తిస్థాయిలో నష్టం అంచనా వేసేందుకు సులువుగా ఉంటుందని చెబుతున్నారు.

Show comments