Minister Anagani Satya Prasad: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారం అవుతున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ఈ లక్ష్యాన్ని సాధించామని మంత్రి గుర్తుచేశారు. 2014-19లో పట్టణాల్లో సెంటున్నర, గ్రామాలలో 2 సెంట్లు ఇచ్చి పేదల పెన్నిదిగా టీడీపీ పనిచేసిందని చెప్పారు. కానీ, వైఎస్ జగన్ రెడ్డి దాన్ని సెంటుకు కుదించి, పేదల ద్రోహిగా మారాడని ఆరోపించారు.
Read Also: ‘The Girlfriend’ : ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ పార్టీకి టైమ్, ప్లేస్ ఫిక్స్!
టీడీపీ ప్రభుత్వం 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిందని గుర్తు చేశారు మంత్రి అనగాని.. గతంలో, జగన్ రెడ్డి మాట్లాడుతూ “ఇళ్లు కాదు, ఊళ్లు నిర్మిస్తాం”, కానీ రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో ఇళ్లు పూర్తిచేసిన తర్వాత చేతులు దులుపుకున్నాడని మంత్రి ఆరోపించారు. సొంత స్థలం లేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల సాయం అందిస్తున్నదని తెలిపారు. 2029 నాటికి ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. వైఎస్ జగన్ సెంటు పట్టా పేరుతో రూ.7,500 కోట్లు దోచుకున్నారని, టీడీపీ పూర్తి చేసిన ఇళ్లను కూడా పంచకుండా, పేదలను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్..
