Kharif Water Release: ఖరీఫ్‌కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్‌.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం

Ap Govt

Ap Govt

Kharif Water Release: ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.. కృష్ణా, గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదలపై సమగ్రంగా చర్చించనున్నారు.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మే 15 నుంచే ఖరీఫ్‌కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించిన నేపథ్యంలో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.

ఈ సమావేశంలో ప్రస్తుత జలాశయాల్లో నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, డెల్టాలకు నీటి విడుదల తేదీలు, సాగునీటి పంపిణీ విధానం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగంలో సమన్వయం పాటించాలని మంత్రులు అధికారులకు సూచించనున్నారు.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు..