NTV Telugu Site icon

EAGLE: గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే.. ఈగల్‌గా మారిన ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్

Eagle

Eagle

EAGLE: నార్కోటిక్ కట్టడిపై సబ్ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే అని ప్రకటించిన మంత్రి లోకేష్.. నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపుతాం అన్నారు.. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా మారుస్తున్నట్టు వెల్లడించారు.. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు..

Read Also: Minister Thummala: రైతులకు గుడ్‌ న్యూస్.. పాలమూరు సభ ద్వారా రూ.3వేల కోట్ల రుణమాఫీ!

కాగా, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల్ ఆకే రవికృష్ణ, ఇతర శాఖ‌ల‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్ గా(ELITE ANTI-NARCOTICS GROUP FOR LAW ENFORECEMENT-EAGLE) మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సాగు గుర్తించి ధ్వంసం చేయ‌డానికి డ్రోన్లను వినియోగించాలని సూచించాను. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాల‌ని కోరాను. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంద‌ని పేర్కొన్నారు.. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయాల‌ని క‌మిటీ సూచించింది సబ్‌ కమిటీ. పంజాబ్ లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఇన్ ఫ్లూయెన్సర్స్ తో అవగాహన కల్పించాలని పేర్కొంది.. గిరిజ‌నులు గంజాయి పండించకుండా అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోనున్నారు..