NTV Telugu Site icon

Amaravati Railway Line: అమరావతికి రైల్వే లైన్‌.. ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్‌..

Amaravati Railway Line

Amaravati Railway Line

Amaravati Railway Line: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది.. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్‌ ఏర్పాటుపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

Read Also: Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..

అమరావతి కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూ సేకరకణ కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రతిపాదిత భూ సేకరణపై ఏమైనా అభ్యంతరాలుంటే 2025 జనవరి 16వ తేదీలోపు తెలపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వేలైను కోసం.. 297 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల, పరిటాల, వీరులపాడు మండలం పెద్దాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, అల్లూరులోభూ సేకరణ జరపనున్నారు.

Read Also: PV Sindhu Reception: కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!

అయితే, రైల్వే లైను ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూముల్లో 99 శాతం ప్రైవేటు భూములే ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు దేవదాయ భూములు ఉన్నాయి. మరోవైపు నోటిఫికేషన్ తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వాటిని పరిష్కరించటం కోసం అధికారులు మార్గాలు వెతుకుతున్నారు. ఇటు భూములను గుర్తించి నోటిఫికేషన్ కూడా ఇవ్వటంతో ఇకపై గ్రామ సభలను ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మొత్తం ప్రక్రియకు ఆరు నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది..

Show comments