APSRTC: దివ్యాంగులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎస్కార్ట్‌కు 50 శాతం రాయితీ..

Apsrtc

Apsrtc

APSRTC: దివ్యాంగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం వారికి కల్పించింది.. అంతేకాదు.. ఇక, దివ్యాంగులతో ఎస్కార్ట్‌గా వచ్చేవారికి కూడా టికెట్‌ ధరలో 50 శాతం రాయితీ కల్పించనున్నారు.. దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సమగ్రతను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఇంద్రధనుస్సు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. APSRTC విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ ఉచిత రవాణా సౌకర్యం Rights of Persons with Disabilities Act, 2016 (RPWD Act 2016) సెక్షన్ 2 (ZC) కింద నిర్వచించబడిన దివ్యాంగులకు వర్తిస్తుంది.

Read Also: APCO Handloom Sale: చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్.. ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ప్రారంభం..

ఏ బస్సుల్లో ప్రయాణం ఉచితం?
దివ్యాంగులు క్రింది 5 కేటగిరీల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు: సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. వారికి ఎస్కార్ట్‌గా వచ్చేవారికి 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. మార్చి 18, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రరబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకం అధికారికంగా ప్రారంభించబడుతుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. దివ్యాంగుల సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం, వారికి సులభమైన రవాణా సౌకర్యం కల్పించడం ఈ నిర్ణయంతో ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా వేలాది మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది.