AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళలను కూలీ స్థాయి నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘PMFME–స్త్రీనిధి’ అనుసంధాన పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం ద్వారా అర్హులైన డ్వాక్రా మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
రూ.3 లక్షల వరకు స్త్రీనిధి రుణం
ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే అర్హులైన డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. స్త్రీనిధి రుణంతో పాటు కేంద్ర ప్రభుత్వ PMFME పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా అందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు తమకు అనుకూలమైన ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది.
Also Read
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
డ్వాక్రా మహిళలను కేవలం కూలీలుగా కాకుండా సొంతంగా ఉపాధి కల్పించుకునే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అర్హుల గుర్తింపునకు జిల్లా సమాఖ్యలు
పథకానికి అర్హులైన డ్వాక్రా మహిళలను గుర్తించేందుకు జిల్లా సమాఖ్యలను ‘డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్లు’ (DROs)గా వినియోగించనున్నారు. అర్హత ఉన్న మహిళలను గుర్తించడం, వారికి అవసరమైన సహకారం అందించడం వంటి అంశాల్లో జిల్లా స్థాయిలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయి.
ప్రాజెక్ట్ రిపోర్ట్ నుంచి మార్కెటింగ్ వరకు సహకారం
రుణం అందించడంతో ప్రభుత్వం బాధ్యత ముగియదని అధికారులు చెబుతున్నారు. మహిళలు ఏర్పాటు చేయబోయే యూనిట్లకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, సాంకేతిక మార్గదర్శకత్వం, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ పూర్తి సహకారం అందించనున్నారు. తద్వారా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి, వ్యాపారాలను స్థిరంగా కొనసాగించేలా తోడ్పాటు అందించనున్నారు.
ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం
ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ పరంగా అండగా నిలిచేలా PMFME–స్త్రీనిధి అనుసంధాన పథకాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
-
LIC Investment: ఎల్ఐసీ మీ పాలసీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? నష్టాలను ఎలా ఎదుర్కొంటుంది? పూర్తి వివరాలు
-
Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Supreme Court: “ఆంక్షలు విధించడానికి మీరెవరు?”.. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!