Site icon NTV Telugu

AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..

Ap Mega Dsc

Ap Mega Dsc

AP DSC: మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనుంది ప్రభుత్వం.. 16 వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించారు.. వీరిలో 15 వేల 941 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు.. అయితే, ఈ రోజు నియామక పత్రాల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమానికి డీఎస్సీ అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో పాటు హాజరుకానుండగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కొంతమందికి నియామక పత్రాలు అందించనున్నారు.. అంటే, టాప్‌ 20 అభ్యర్థులకు ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.. ఇక, మిగిలిన వారికి ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు నియామక పత్రాలు అందిస్తారు… ఏపీ సచివాలయం వెనక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.. ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందిస్తారు… ఉద్యోగం పొందిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరుకానుండగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ సహా మరికొందరు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అయితే, అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు కూటమి ఎమ్మెల్యే లు.. ఎమ్మెల్సీ లు..

Read Also: Kalaimamani Award: సాయి పల్లవి, ఏసుదాస్ కి కలైమామణి పురస్కారం

Exit mobile version