Pawan Kalyan: వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి.. పవన్ కల్యాణ్ పిలుపు..
- జాతీయ చేనేత దినోత్సవం..
- చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్..
- యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరించాలి..
- ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని.. అందుకే అంతా వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఊతం ఇస్తుందన్నారు.. చేనేత… మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు..
Read Also: TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే అసంఘటిత రంగాలలో చేనేత ఒకటి. ఈ రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఊతమిస్తుందన్నారు పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాం.. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం.. సొసైటీలనుoచి ఆప్కో కొనేవాటికి జీఎస్టీపై 5 శాతం రాయితీ అమలు చేయడంతోపాటు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. చేనేత వస్త్రాలు వినియోగం పెంచే దిశగా ప్రచార కార్యక్రమాలు పెంపొందిస్తాం… యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: CM Revanth Reddy: మోడీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇక, మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది చేనేత. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత రంగానికి ఊతమివ్వడానికి NDA కూటమి ప్రభుత్వం అన్ని వవిధాలుగా అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఊతం
చేనేత… మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే అసంఘటిత రంగాలలో చేనేత…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 7, 2025
మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది చేనేత. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత రంగానికి ఊతమివ్వడానికి NDA కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని… pic.twitter.com/hSsanxOHD3
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 7, 2025
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!