Site icon NTV Telugu

Pawan Kalyan: వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..

Pawan

Pawan

Pawan Kalyan: యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని.. అందుకే అంతా వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఊతం ఇస్తుందన్నారు.. చేనేత… మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు..

Read Also: TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు

మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే అసంఘటిత రంగాలలో చేనేత ఒకటి. ఈ రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఊతమిస్తుందన్నారు పవన్‌ కల్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాం.. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం.. సొసైటీలనుoచి ఆప్కో కొనేవాటికి జీఎస్టీపై 5 శాతం రాయితీ అమలు చేయడంతోపాటు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. చేనేత వస్త్రాలు వినియోగం పెంచే దిశగా ప్రచార కార్యక్రమాలు పెంపొందిస్తాం… యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Read Also: CM Revanth Reddy: మోడీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఇక, మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచింది చేనేత. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత రంగానికి ఊతమివ్వడానికి NDA కూటమి ప్రభుత్వం అన్ని వవిధాలుగా అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను అంటూ మరో ట్వీట్‌ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version