Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆయన.. తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంట.. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు గజేంద్ర సింగ్ షెఖావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తుచేశారు.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది.. గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చు అన్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని గజేంద్ర సింగ్ షెఖావత్‌ను కోరామని.. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: President Droupadi Murmu: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్‌సభ స్పీకర్
ఇక, ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా గడపనున్నారు పవన్ కల్యాణ్.. ఈ రోఉ మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు.. మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు.. ఏపీకి రావాల్సిన నిధులు.. పెండింగ్ అంశాలపై సమాలోచనలు చేయనున్నారు.. సాయంత్రం 4:30కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యి.. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు.. ఇక, సాయంత్రం 5:15 గంటలకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీకానున్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. పార్లమెంట్ లో రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..