NTV Telugu Site icon

Pawan Kalyan on HYDRA: హైడ్రాపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan on HYDRA: తెలంగాణ ప్రభుత్వం.. హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు అక్రమ కట్టడాల పనిపడుతోంది.. హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఒక స్వతంత్ర సంస్థగా ఇది ఏర్పాటు చేశారు.. దీనికి కమిషనర్‌ గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూలుస్తూ దూకుడు చూపిస్తోంది హైడ్రా.. అయితే, హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: ANR 100 : అక్కినేని నాగేశ్వరరావు ‘కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌

ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలి అనేది చర్చిస్తాం అన్నారు పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌లో చెరువుల్లో ఇల్లు కట్టేస్తున్న సమయంలో చూసే వాడిని.. ఇళ్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అనుకునే వాడిని.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు అని అభినందించారు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని.. అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు.. ఇక, ఇళ్ల నిర్మాణాలు చేసే సమయంలో.. వెంచర్లు వేసే సమయంలో.. వీటిని అడ్డుకోవాలి.. పలుకుబడితో ఇలాంటి నిర్మాణాలు చేపడితే.. దాచుకున్న డబ్బుతో ఇళ్లను కొన్న వారికి వాటిని తొలగిస్తే నష్టం జరుగుతందన్నారు.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే ఈ ఆక్రమణలను, అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే 10 ఏళ్ల తర్వాతైనా మళ్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Show comments