Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు పూనుకుంది.. అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు..
Read Also: Pak Vs NZ: పాకిస్తాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్..
అయితే, దివాన్ చెరువు దగ్గర ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు కానుంది.. అవసరమైన శిక్షణ, అటవీ వాతావరణాన్ని కల్పించడంతోపాటు రవాణా, మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు పవన్ కల్యాణ్.. రక్షిత అటవీ ప్రాంతాన్ని వినియోగించుకొనే విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోనుంది ప్రభుత్వం.. దీనిపై కేంద్రానికి లేఖ రాయగా.. దివాన్ చెరువులోని రక్షిత అటవీ ప్రాంతంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.. ఇక, కేంద్రం స్పష్టత ఇచ్చిన క్రమంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుపై ఉన్నతాధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు..