NTV Telugu Site icon

CS Nirab Kumar Prasad: సీఎస్ పదవీ కాలం పొడిగింపు.. మరో 6 నెలలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

Cs

Cs

CS Nirab Kumar Prasad: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది.. సీఎస్‌ను కూడా మార్చారు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌,, మంత్రుల ప్రమాణస్వీకారం కంటే ముందే.. ఏపీ నూతన సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.. ఆయన అధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. అయితే, ఆయన పదవీ కాలం త్వరలోనే ముగిసిపోనుంది.. ఈ నెలాఖరుకు రిటైర్డ్‌ కావాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో.. మరో ఆరు నెలల పాటు నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ సర్వీసును పొడిగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు.. ఇక, ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.. దీంతో.. ఆయన మరో ఆరు నెలలు ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు నీరబ్‌ కుమార్‌ ప్రసాద్.. అంటే, సర్వీస్ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ కొనసాగుతారన్నమాట.

Read Also: Maharashtra: మహారాష్ట్ర ఇండీ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు..? ఠాక్రే సమాధానం..

గత ప్రభుత్వంలో సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం సెలవు మంజూరు చేసిన విషయం విదితమే.. ఈ నెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అంటే 21 రోజుల పాటు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ.. ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సెలవు అనంతరం జవహర్ రెడ్డి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని కూడా సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం విదితమే.. మరోవైపు.. జవహర్‌రెడ్డి సీఎస్‌గా ఉన్న సమయంలో.. అనేక ఆరోపణలు వచ్చాయి.. ఎన్నికల సమయంలో.. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లిన విషయం విదితమే.