AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP ZPTC, MPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వేళ కూటమిలో పొత్తులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు పంచుకున్న కూటమి పార్టీలు ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపిణీపై చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు గత రెండు రోజులుగా స్థానాల సర్దుబాటుపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఏయే ప్రాంతాల్లో ఎవరికి అవకాశం కల్పించాలి? అనే అంశాలపై ప్రధానంగా కసరత్తు జరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని కూటమి నాయకత్వం భావిస్తోంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య రెండుసార్లు చర్చలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లి సీట్ల పంపిణీపై చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య రెండుసార్లు చర్చలు జరిగినట్లు సమాచారం. మూడు పార్టీల మధ్య సమన్వయం సాధించి, ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లేలా నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించాల్సిన స్థానాలపై కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 జడ్పీటీసీ స్థానాలు, 30 ఎంపీపీ అధ్యక్ష స్థానాలతో పాటు వందకు పైగా ఎంపీటీసీ స్థానాలను బీజేపీకి కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తం స్థానాల్లో బీజేపీకి ఐదు శాతం వరకు కేటాయించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read
- AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
- Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
జనసేనకు 30 శాతం స్థానాలు ఇవ్వాలని పవన్ ప్రతిపాదన
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేనకు 30 శాతం స్థానాలు కేటాయించాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే, జడ్పీ ఛైర్పర్సన్ స్థానాల్లో తొమ్మిది స్థానాలు జనసేనకు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీలోనూ ఆయా స్థానాల కోసం పోటీ ఎక్కువగా ఉందని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పలువురు నేతలు జడ్పీ ఛైర్పర్సన్ పదవులను ఆశిస్తున్నందున, ఈ అంశంపై పునరాలోచన చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య మధ్యేమార్గంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. రెండు పార్టీలకు ఆమోదయోగ్యమైన రీతిలో స్థానాలను సర్దుబాటు చేసేందుకు నాయకత్వం ప్రయత్నిస్తోంది.
అల్లూరి జడ్పీ ఛైర్పర్సన్ స్థానం జనసేనకు?
ఏజెన్సీ ప్రాంతంలోని అల్లూరి జిల్లా పరిషత్తు ఛైర్పర్సన్ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. జడ్పీ ఛైర్పర్సన్ స్థానాల పంపిణీతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపైనా కూటమి నేతలు దృష్టి సారించారు. మరోవైపు.. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు అధ్యక్షుల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు. జడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్తు ఛైర్పర్సన్ను, ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్తు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దీంతో ముందుగా ఆయా స్థానాల్లో కూటమి పార్టీల మధ్య పోటీ, సీట్ల పంపిణీపై స్పష్టత రావడం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? ఎవరికి ఏ స్థానం కేటాయించాలి? అనే అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో అభ్యర్థుల ఎంపిక, స్థానాల సర్దుబాటులో స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని నేతలు భావిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, జిల్లా నేతలదే కీలక పాత్ర
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లా నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ముఖ్యపాత్ర పోషించాలని కూటమి నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేల స్థాయిలోనే చర్చలు జరిపి, స్థానాల సర్దుబాటుకు అనుగుణంగా నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, అనేక ప్రాంతాల్లో సీట్ల పంపిణీపై స్పష్టత రాకపోవడంతో మూడు పార్టీల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఏకాభిప్రాయం సాధించడం కూటమి నాయకత్వానికి సవాలుగా మారింది.
సమన్వయ కమిటీలకు ఉపసంహరణ బాధ్యత
కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిన వెంటనే, మిగిలిన రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా సమన్వయ కమిటీలు బాధ్యత తీసుకోవాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఒక పార్టీకి కేటాయించిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండకుండా చూడటం ఈ కమిటీల ప్రధాన బాధ్యత కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు, అంటే ఇవాళ రాత్రి లేదా రేపటిలోగా సీట్ల పంపిణీపై చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. చివరకు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి? జనసేన కోరుతున్న 30 శాతం స్థానాల ప్రతిపాదనకు ఎంతవరకు ఆమోదం లభిస్తుంది? బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు? అనే అంశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
-
BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతీ నెల ఇచ్చే స్టైఫండ్ పెంపు..
-
RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!