NTV Telugu Site icon

CM Chandrababu: నేడు శ్రీశైలం, సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన..

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. నేడు శ్రీశైలం రానున్నారు.. సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10:50కి శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు. తర్వాత నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు.. ముఖ్యమంత్రి. ఇక శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిచి.. నీటి వినియోగదారుల అసోసియేషన్‌తో భేటీ అవుతారు. తిరిగి 12:30కి హెలికాప్టర్‌లో అనంతపురం వెళ్తారు సీఎం చంద్రబాబు.

Read Also: Off The Record : తెలంగాణ పాలిటిక్స్ లో పవర్ హై వోల్టేజ్

ఇక, శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాలలో లబ్దిదారులకు పింఛన్‌ అందిస్తారు.. సీఎం. అనంతరం మల్బరి ప్లాంటేషన్ షెడ్‌ను సందర్శించి .. పట్టు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. తర్వాత గుండుమలలో కరియమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. కరియమ్మ గుడి వద్దనే గ్రామస్తులతో చంద్రబాబు ఇంటరాక్షన్ ఉండనుంది.. మధ్యాహ్నం 3:25 నుంచి 4:25 వరకు స్థానికులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అమరావతికి తిరిగి బయల్దేరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

సీఎం షెడ్యూల్..

* ఉదయం హెలికాప్టర్ లో 10:30 కి సుండిపెంటకు హెలిప్యాడ్ చేరుకోనున్న సీఎం చంద్రబాబు
* 10:50 కి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న చంద్రబాబు
* 11:25 కి శ్రీశైలం జలాశయం సందర్శన, కృష్ణానదికి జలహారతి, నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ
* 11:40కి శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం సందర్శన
* మధ్యాహ్నం 12:05కి నీటి వినియోగదారుల అసోసియేషన్ తో చంద్రబాబు భేటీ
* 12:30కి హెలికాప్టర్ లో అనంతపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
* మధ్యాహ్నం 1:45కి గుండుమల ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాల హెలిపాడ్ చేరుకొనున్న సీఎం.
* 2:20 గంటలకు గుండుమలలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ
* 3:20 కి గుండుమలలో కరియమ్మ దేవి దేవాలయన్ని సందర్శన.
* 3:25 నుంచి 4:25 దాక గ్రామ ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖాముఖి.